Chandrababu: అమెరికా రోడ్లపై... చిరుతిళ్లు తింటూ.. చంద్రబాబు షికారు.. వీడియో ఇదిగో!

  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో చంద్రబాబు
  • వీధుల్లో చక్కర్లు కొడుతూ చిరుతిళ్లు
  • నేతలతో ఆసక్తికర సంభాషణ
ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఓ సామాన్యుడిలా వీధుల్లో సంచరించారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ప్రకారం, వీధుల్లో నడుస్తూ, అక్కడి అంగళ్లలోని చిరుతిళ్లు కొనుక్కుని తిన్నారు. అదే సమయంలో ఆయన వెంట నడుస్తున్న పార్టీ నేత, "సార్, ఐస్ క్రీమ్ తింటారా?" అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్పారో వినపడలేదుగానీ, "మేడమ్ లేనప్పుడే మనం ఏదైనా తింటే..." అని అనడం మాత్రం వినిపించింది. దీనికి చంద్రబాబు "వద్దురా..." అని సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.
Chandrababu
USA
Roads
Ice Cream

More Telugu News