చింతమడకలోనే కాదు రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఇవ్వాలి: భట్టి విక్రమార్క డిమాండ్

01-08-2019 Thu 19:55 | Andhra
  • చింతమడక ప్రజలకు లబ్ధి చేకూరుస్తామని కేసీఆర్ చెప్పారు
  • రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో లబ్ధి చేకూర్చాలి
  • ఈ పథకానికి ‘చింతమడక స్కీమ్’ అని పేరు పెట్టారు
సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి చేకూరుస్తామని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడం తెలిసిందే. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన గురించి టీ-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు చింతమడక తరహాలోనే లబ్ధి చేకూర్చాలని, ఈ పథకానికి ‘చింతమడక స్కీమ్’ అని పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని అన్నారు.

రాష్ట్రంలోని ప్రజలందరినీ సమదృష్టితో  కేసీఆర్ చూడట్లేదన్న భావన ప్రజల్లో కలిగితే వారిలో అశాంతి పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే, ఈ పథకం ఏర్పాటుపై కేసీఆర్ వెంటనే ఓ నిర్ణయం తీసుకోకపోతే అర్హులైన కుటుంబాలను కూడగట్టే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. చింతమడక ప్రజలకు ఇస్తానన్నది సీఎం సొంత సొమ్ము ఏమీ కాదని అన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు సందర్శనకు మీడియా ఎడిటర్లను తీసుకెళ్లాలన్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనకు సంబంధించిన సమగ్ర నివేదికతో పాటు తీసుకొచ్చిన అప్పుల వివరాల ప్రతులను మీడియాకు చూపించాలని సూచించారు.
Siddipet DistrictchintamadakakcrBhatti

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more