రవిశేఖర్‌ సామాన్యుడు కాదు...బాలికను కిడ్నాప్‌ చేసినా కించిత్తు భయంలేకుండా తిరిగాడు

01-08-2019 Thu 12:36 | Both States
  • దొంగిలించిన కారులోనే ఎక్కువ సమయం
  • నంబర్‌ ప్లేట్లు మార్చుతూ హల్‌చల్‌
  • పరారీలో ఉంటూనే మోసాలు
హైదరాబాద్‌ నగర శివారు హయత్‌నగర్‌ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైనా అందుకు బాధ్యుడైన రవిశేఖర్‌ లీలలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుంటే పోలీసులకే నమ్మశక్యం కావడం లేదు. ఓవైపు తనకోసం పోలీసులు వేటాడుతున్నారని తెలిసినా కించిత్తు భయం, ఆందోళన లేకుండా తన మోసాల పరంపరను అతను కొనసాగించడం విశేషం.

ఉద్యోగం పేరుతో మాయమాటలు చెప్పి బాలికను కిడ్నాప్‌ చేసిన రవిశేఖర్‌ ఆమెను అద్దంకి బస్‌స్టేషన్‌లో హైదరాబాద్‌ వెళ్లే బస్సు ఎక్కించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తనకోసం మాటువేసిన రాచకొండ పోలీసులకు చిక్కాడు. ‘తీగ లాగితే డొంక కదిలింది’ అన్న చందంగా రవిశేఖర్‌ మోసాల లిస్టు చూసిన పోలీసులే బిత్తరపోతున్నారు. కర్ణాటక జిల్లా బళ్లారిలో ఐ20 కారును దొంగిలించిన రవిశేఖర్‌ దాని నంబరు ప్లేట్లు మార్చుతూ అందులోనే తిరుగుతున్నాడు. ఈ కారులోనే బాధితురాలిని అపహరించాడు.

తొలుత విద్యార్థినిని, ఆమె తండ్రి, సోదరుడిని  కారు ఎక్కించుకున్నాడు. ధ్రువపత్రాల జిరాక్స్‌ కోసం తండ్రి, సోదరుడు కారు దిగి వెళ్లగానే బాలికతో వుడాయించాడు. అనంతరం  ఆమెను కారులోనే ఉంచి చిత్తూరు, కడప, కర్నూల్‌ జిల్లాల్లో సంచరించాడు. మధ్యలో నల్గొండ జిల్లాకు వచ్చి ఓ ఎరువుల దుకాణంలో దోపిడీకి కూడా పాల్పడడం విశేషం. ఇన్ని చేసినా పోలీసులు తనకోసం వేటాడుతున్నారన్న విషయం అతనికి తెలియదట.

రాచకొండ పోలీసులు బృందాలుగా విడిపోయి వేటాడుతున్నా, ఆ విషయం మీడియాలో విస్తృతంగా వస్తున్నా కారులో తిరుగుతుండడం వల్ల టీవీ చూసే అవకాశం లేకపోవడంతో అతనికీ విషయం తెలియదని అంటున్నారు. రవిశేఖర్‌ ఫోన్‌ కూడా వాడక పోవడం, బాలిక వద్ద కూడా ఫోన్‌ లేకపోవడంతో ఎటువంటి సమాచారం లేకుండా పోయింది.

బాలికను కారులోనే తిప్పుతూ ఆమె తండ్రి మన వద్దకే వస్తున్నాడని చెప్పి నమ్మించడంతో ఆమె కూడా ఏమీ అనలేదు. దీంతో రవిశేఖర్‌ కిడ్నాప్‌ వ్యవహారం సాఫీగా సాగిపోయింది. కాగా, రవిశేఖర్‌పై దాదాపు 30 కేసులు ఉన్నట్లు సమాచారం. గతంలో జనవరిలో తాడేపల్లిగూడెం పోలీసులను బురిడీకొట్టించి, మేలో విశాఖ బస్టాండ్‌ నుంచి తప్పించుకున్నాడు.
Crime Newsravishekarhayatnagargirl kidnap

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more