ఎంట్రన్స్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థి.. స్కూలు ఫీజులో 50 శాతం వెనక్కి ఇచ్చేయమన్న వినియోగదారుల ఫోరం

01-08-2019 Thu 10:18 | National
  • కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలుకు ఫోరం మొట్టికాయలు
  • అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్కూల్లో నాసిరకం విద్యపై విస్మయం
  • విద్యార్థికి అనుకూలంగా ఆదేశాలు
తీసుకున్న స్కూలు ఫీజులో 50 శాతాన్ని విద్యార్థికి వెనక్కి ఇచ్చేయాల్సిందిగా పంజాబ్‌లోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూలును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఓ సాధారణ విద్యాసంస్థలో చేరేందుకు రాసిన ప్రవేశపరీక్షలో తమ కుమారుడు ఫెయిలవడంతో విద్యార్థి తల్లి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది.

తన కుమారుడు చదువుకున్న కేంబ్రిడ్జి స్కూలులో సరైన విద్య అందకపోవడం వల్లే అతడు ఫెయిలయ్యాడని ఆరోపిస్తూ బాలుడి తల్లి ప్రియాంక ఈ ఏడాది ఏప్రిల్ 19న ఫిర్యాదు చేసింది. స్కూలు ఫీజు కింద  రూ.1.75 లక్షలు చెల్లించానని తెలిపింది. ఇంటర్నేషనల్ స్కూలు అన్న కారణంతోనే చదివించానని పేర్కొంది. ప్రోగ్రెస్ కార్డులో మంచి మార్కులే వేసేవారని, కానీ వేరే స్కూల్లో తన కుమారుడిని చేర్చాలనుకున్నప్పుడు స్కూలు బండారం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

మూడేళ్ల తర్వాత ఓ సాధారణ స్కూల్‌లో చేర్పించాలనుకున్నానని, ఇందుకోసం ఆ స్కూలు యాజమాన్యం పెట్టిన ప్రవేశ పరీక్షలో తన కుమారుడు ఫెయిలయ్యాక కేంబ్రిడ్జి పాఠశాల అందించిన విద్య ఏపాటిదో అర్థమైందని వాపోయింది. తాను చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇప్పించాల్సిందిగా వేడుకుంది.

ఇరుపక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న స్కూలులో చదువుకున్న విద్యార్థి సాధారణ స్కూలు ఎంట్రన్స్‌లో పాస్ కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. మూడేళ్లపాటు విద్యార్థి నుంచి వసూలు చేసిన 1.75 లక్షలలో 50 శాతాన్ని వెనక్కి ఇవ్వాలని స్కూలును ఆదేశించింది. అలాగే, వారు అనుభవించిన మానసిక క్షోభకు రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మూడు వేల రూపాయలను నెలలోపు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, మరో ఐదు వేల రూపాయలను లీగల్ ఎయిడ్ ఫండ్ కింద డిపాజిట్ చేయాలని స్కూలు యాజమాన్యాన్ని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Cambridge International Schooleducationstudent

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more