ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

01-08-2019 Thu 09:27 | Both States
  • యశ్ రాజ్ సినిమాను కాపీ కొట్టిన బెల్లంకొండ
  • సిద్ధార్థ్, సమంతలతో 'జబర్దస్త్' సినిమా
  • ఆరేళ్ల క్రితమే సినిమాను అడ్డుకున్న ఢిల్లీ హైకోర్టు
  • అప్పటికే శాటిలైట్ హక్కులను అమ్మేసుకున్న బెల్లంకొండ
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఓ ప్రముఖ టీవీ చానల్ తమకు రూ. 3.50 కోట్లను ఇవ్వడంలో సురేష్ విఫలం అయ్యారని ఆరోపించగా, కోర్టు అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు ఆరేళ్ల క్రితం హిందీలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ 'బాండ్ బాజా బరాత్' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇది హిందీలో సూపర్ హిట్ అయింది.

అదే సమయంలో బెల్లంకొండ సురేష్, సమంత, సిద్ధార్థ్ హీరో హీరోయిన్లుగా 'జబర్దస్త్' అనే సినిమాను నిర్మించారు. తమ సినిమాలోని 19 సీన్లను 'జబర్దస్త్'లో కాపీ చేశారని ఆరోపిస్తూ, అప్పట్లోనే యశ్ రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన కోర్టు సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.

కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శాటిలైట్ హక్కులను రూ. 3.50 కోట్లకు బెల్లంకొండ అమ్మేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ హైకోర్టు, చిత్రాన్ని టీవీల్లో సైతం ప్రదర్శించరాదని ఆదేశించింది. ఆపై సదరు టీవీ చానల్ తాము చెల్లించిన రూ. 3.50 కోట్లను తిరిగి చెల్లించాలని బెల్లంకొండ సురేష్ చుట్టూ ఆరేళ్లుగా తిరుగుతున్నా, ఇవాళ, రేపు అంటూ ఆయన తిప్పించుకున్నారు. దీంతో సదరు చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో చానెల్ ఇచ్చిన రూ. 3.50 కోట్ల మొత్తం ఇప్పుడు వడ్డీలతో కలిపి రూ. 11.75 కోట్లకు చేరడం గమనార్హం.
Yashraj FilmsBellamkonda SureshArrestwarrentSamanthaSidharth

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more