'రోల్స్ రాయిస్ పీఎల్సీ' కంపెనీపై సీబీఐ కేసు.. వివరణ ఇచ్చిన కంపెనీ!

01-08-2019 Thu 08:45 | National
  • ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టుల కోసం అడ్డదారులు తొక్కిన రోల్స్ రాయిస్ పీఎల్సీ   
  • ఓ ఏజెంట్ కు రూ. 77 కోట్లు చెల్లించిన వైనం
  • పలువురు అధికారులపై కూడా కేసు నమోదు
ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లు, ప్రధాన విడి భాగాలు తయారు చేసే రోల్స్ రాయిస్ పీఎల్సీ  (రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ కాదు) పై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఓ ఏజెంట్ కు రూ. 77 కోట్ల కమిషన్ ను రోల్స్ రాయిస్ పీఎల్సీ చెల్లించిందని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఈ కేసును సీబీఐ దాదాపు ఐదేళ్ల పాటు దర్యాప్తు చేసింది. 2007-11 మధ్య కాలంలో ఈ కాంట్రాక్టుల లావాదేవీలు జరిగాయని సీబీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో, రోల్స్ రాయిస్ పీఎల్సీతో పాటు భారత అనుబంధ సంస్థలైన హెచ్ఏఎల్, ఓఎన్జీసీ, గెయిల్ లలో పని చేస్తున్న కొందరు అధికారులపై కూడా కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంచితే, లండన్ కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ ఈ వార్తలను ఓ ప్రకటనలో ఖండించింది. ఈ కేసు తమ సంస్థకు సంబంధించినది కాదనీ, ఈ విషయంలో సీబీఐని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. తమ సంస్థ అత్యున్నత నైతిక విలువలకు కట్టుబడి వున్న సంస్థ అనీ, ఎవరు ఎటువంటి అనైతిక కార్యకలాపాలకు ఏ రూపంలో పాల్పడినా సహించేది లేదని పేర్కొంది. తమ సంస్థ తరఫున ఎవరూ ఇండియాలో పనిచేయడం లేదని స్పష్టం చేసింది. భారత్ తమకు ప్రధాన మార్కెట్ ప్రదేశమని, నైపుణ్యం గల ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపింది.

ఇదే సమయంలో రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సంస్థకూ, రోల్స్ రాయిస్ పీఎల్సీ సంస్థకూ వున్న తేడాను కూడా వివరించింది. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూపునకు చెందినదని, రోల్స్ రాయిస్ పీఎల్సీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లను, విడి భాగాలను తయారు చేసే ప్రత్యేక సంస్థ అనీ సదరు సంస్థ అధికార ప్రతినిధి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.   
Rolls RoyceCBICase

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more