పుల్వామా ఉగ్రదాడి సహ కుట్రదారుడు హతం

  • అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
  • బక్తూర్ గురేజ్‌లో ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
  • గురేజ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఇండియన్ ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌లోని బక్తూర్ గురేజ్‌లో మంగళవారం మధ్యాహ్నం మారణాయుధాలు ధరించిన కొందరు చొరబాటుదార్లు భద్రతా దళాలపైకి కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ భీకరంగా జరుగుతోంది.

అనంత్‌నాగ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒక ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు తనను తాను కమాండర్‌గా ప్రకటించుకున్నట్టు భద్రతాధికారులు తెలిపారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనక హతమైన ఉగ్రవాది పంజూ అలియాస్ ఫయాజ్ అహ్మద్ థోకర్ అలియాస్ హజుల్లా బై హస్తం ఉందని, ఈ దాడిలో అతడు సహ కుట్రదారుడని ఆర్మీ తెలిపింది. పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
Go Back to Shorts
pulwama
encounter
Indian army
terrorist

More Telugu News