తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. నేడు, రేపు కూడా!

30-07-2019 Tue 06:34 | Telangana
  • నాలుగు రోజులుగా వర్షాలు
  • ఆదిలాబాద్ జిల్లాలో 9 గంటల వ్యవధిలోనే 133.5 మిల్లీమీటర్ల వర్షపాతం
  • తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు.. విద్యుత్‌కు తగ్గిన డిమాండ్
ఒడిశా ఉత్తర ప్రాంతం నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, రాజస్థాన్‌ దక్షిణ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నేడు, రేపు కూడా వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల భద్రాద్రి విద్యుత్ కేంద్రం (బీటీపీఎస్) నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 23.9 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలోని వాగులు పొంగడంతో గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 గంటల వ్యవధిలోనే  కుమురం భీం జిల్లా బెజ్జూరులో ఏకంగా 133.5 మిల్లీమీటర్లు, రవీంద్రనగర్‌లో 122.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలు తెరిపినివ్వకుండా కురుస్తుండడంతో పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. హన్మకొండలో సోమవారం సాధారణం కంటే 6.1 డిగ్రీల తక్కువ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో ఇలాగే 4.8 డిగ్రీలు తగ్గి 25.6 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది.
TelanganaRainssouthwest monsoonAdilabad District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more