ఇది హైటెక్ మోసం.. టెక్నాలజీతో జగన్ పీఏగా చెలామణి.. పలువురు నేతలకు యువకుల టోకరా!
- విశాఖ కేంద్రంగా యువకుల ముఠా
- స్ఫూఫింగ్ టెక్నాలజీతో జగన్ పీఏగా ఫోన్
- వైసీపీ టికెట్ ఇస్తామని భారీగా వసూళ్లు
అయితే ఇంకొందరు నేతలు ఈ తతంగంపై అనుమానం వచ్చి కాల్ కట్ చేసి నేరుగా జగన్ కార్యదర్శికి ఫోన్ చేశారు. దీంతో తాను ఎవ్వరికీ ఫోన్లు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత నేతలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఈ మోసంపై వైసీపీ సంయుక్త కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మరో కేసులో రాజమండ్రి పీఎస్ లో ఉన్న ఈ నలుగురు నిందితులను పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వీరిపై ఇప్పటికే పలు సైబర్ నేరాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరతామన్నారు.