సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. లేదంటే ప్రజలను మోసం చేసినట్లే!: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
- కేంద్రం రూ.6 వేలను ఇస్తోంది
- దీనికి అదనంగా వైసీపీ సర్కారు రూ.12,500 ఇవ్వాలి
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత
ఈరోజు ట్విట్టర్ లో విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ..‘సీఎం జగన్ గారూ.. ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇస్తున్న రూ.6 వేలు కాకుండా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మరో రూ.12,500ను కచ్చితంగా ఇవ్వాలి. రాష్ట్రంలో అప్పులతో అల్లాడిపోతున్న రైతన్నల ఆత్మహత్యల నివారణకు ఈ పెట్టుబడి సాయం ఉపశమనం కలిగిస్తుంది. కేంద్రం ఇస్తున్న మొత్తంతో కలిపి రూ.12,500 ఇస్తే రైతులను మోసం చేసినట్టే అవుతుంది. పునరాలోచించుకోండి’ అని ట్వీట్ చేశారు.