నా భార్య ఆరోగ్యమే నాకు ముఖ్యం: కౌశల్

  • బుల్లితెరపై కౌశల్ కి క్రేజ్ 
  •  భార్య కేన్సర్ తో బాధపడుతోంది   
  • సినిమాల సంగతి తరువాత ఆలోచిస్తానన్న కౌశల్      
'బిగ్ బాస్' సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ను బుల్లితెర ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత సినిమాలతో ఆయన బిజీ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అదే సమయంలో ఆయన తన భార్య కేన్సర్ తో బాధపడుతోందనే విషయాన్ని బయటపెట్టాడు.

ఆ తరువాత ఆయన ఒక్క సినిమాను ఒప్పుకున్నది లేదు. దాంతో సినిమా ఎప్పుడు చేస్తారంటూ చాలామంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మామూలుగానే అడుగుతున్నారు. ఈ విషయంపై ఇన్స్టా గ్రామ్ ద్వారా కౌశల్ స్పందిస్తూ .. " నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరియర్ కంటే ఎక్కువ. ఆమె ఆరోగ్యం మెరుగైన తరువాతనే సినిమాల గురించి ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
kaushal

More Telugu News