కర్రను మైక్‌లా పట్టుకుని రిపోర్టింగ్ అదరగొట్టిన చిన్నారి.. వీడియో వైరల్
- పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీరు
- నడిచేందుకు తీవ్ర ఇబ్బందికరంగా తయారైన రోడ్లు
- ఈ పరిస్థితులను వివరిస్తూ చిన్నారి రిపోర్టింగ్
ఈ నేపథ్యంలో ఓ చిన్నారి దీనిపై రిపోర్టింగ్ చేసింది. కర్రను మైక్‌లా పట్టుకుని హిందీలో ఎడపెడా దంచేసింది. నీరు చాలా వేగంగా ప్రవహిస్తోందని, ఓ ఇంటిని చూపిస్తూ అది నీటితో ఎలా నిండిపోయిందో చూడాలని తెలిపింది. ఆ ఇంట్లో నీరు రాకుండా వారు పడుతున్న కష్టాలను చూడండంటూ అద్భుతంగా రిపోర్టింగ్ చేసింది. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు చిన్నారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.