ఇది మా అమెరికా కాదు.. మీ అమెరికా కాదు.. అందరిదీ!: ట్రంప్ పై మిషెల్ ఒబామా ఫైర్
- ఇది మనందరి అమెరికా
- ఇక్కడున్నవారంతా అమెరికన్లే
- భిన్నత్వంలో ఏకత్వమే అమెరికా గొప్పదనం
నలుగురు డెమోక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై ట్రంప్ మండిపడ్డారు. అమెరికాలో మీరు సంతోషంగా లేకపోతే... మీరు పుట్టిన స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జాతి వివక్ష వ్యాఖ్యలంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నలుగురిలో ఒకరైన ఇల్హన్ ఒమర్ మాట్లాడుతూ, సోమాలియా నుంచి వచ్చిన మహిళ ఎదగడాన్ని ట్రంప్ భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ట్రంప్ నిర్ణయాలతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని... ట్రంప్ కూడా నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తామని హెచ్చరించారు.