అమెరికా పుణ్యమాని... ఆరేళ్ల గరిష్ఠానికి బంగారం ధరలు!
- వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు
- మధ్య ప్రాచ్య దేశాల్లో అనిశ్చితి
- 1450 డాలర్లకు ఔన్సు బంగారం ధర
ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1450 డాలర్లకు చేరింది. గడచిన వారం రోజుల వ్యవధిలో బంగారం ధర 2 శాతానికి పైగా పెరిగింది. క్రూడాయిల్ ధరలు పెరుగుతూ, డాలర్ బలహీనపడటం కూడా బంగారానికి డిమాండ్ ను పెంచింది. ఇక ఇండియా విషయానికి వస్తే, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 35,333 వద్ద కొనసాగుతుండగా, వెండి ధర కిలోకు రూ. 41,304 వద్ద ఉంది.