పులివెందుల తరహా పంచాయితీ ఇక్కడ చేయాలనుకుంటే కుదరదు!: టీడీపీ అధినేత చంద్రబాబు
- 2018లో పవన విద్యుత్ ధరలపై పిటిషన్ వేశాం
- 82 కంపెనీలు దానిపై కోర్టుకు వెళ్లాయి
- అమరావతిలో మీడియాతో చంద్రబాబు
అమరావతి పరిధిలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉందని చంద్రబాబు తెలిపారు. అయితే షేర్ మార్కెట్ తరహాలో ఇప్పుడు రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయిందని వ్యాఖ్యానించారు. రాజధానిలో కూలీలకు పని కూడా దొరకడం లేదని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి సీఎం జగన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇలాంటి పులివెందుల పంచాయితీలు ఇక్కడ నడవవని స్పష్టం చేశారు. నిర్మాణాలు ఆగిపోవడంతో రాజధాని ప్రాంతంలోని చాలామంది కూలీలకు ఉపాధి దొరకడం లేదని చంద్రబాబు చెప్పారు.