అందుకే నేను టీడీపీని వదిలేసి బీజేపీలో చేరాను!: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి
- విజయవాడలో బీజేపీ ఆత్మీయ సమావేశం
- మోదీ, షాతో భారత్ ప్రాధాన్యత పెరిగిందన్న సుజనా
- చంద్రబాబు అధర్మపోరాటాలు చేశారని విమర్శలు
ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సారథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని సుజనా చౌదరి తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ధర్మపోరాటాల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. ఈ విషయంలో తాను గొంతు విప్పి చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు.