కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

  • మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
  • సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరపనున్న ఉపసంఘం
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో పలు వ్యవస్థాపరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంలో అన్ని కోణాల్లో ఈ కమిటీ పరిశీలన జరిపి నివేదిక రూపొందించనుంది. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. కాగా, మంత్రివర్గ ఉపసంఘంలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల నాని ఉన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News