సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తామన్న రేషన్ డీలర్లు.. భారీగా మోహరించిన పోలీసులు!
- రేషన్ డీలర్లు ఎక్కడికక్కడ అరెస్ట్
- డ్వాక్రా మహిళలను కూడా వెనక్కి పంపుతున్న పోలీసులు
- ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించిన సీఎం జగన్
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీగా బలగాలను మోహరించారు. ముఖ్యమంత్రి నివాసమున్న ప్రాంతంలో సెక్షన్ 30 విధించారు. కృష్ణానది వారధి ప్రాంతం నుంచి వస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే వినతిపత్రాలు ఇచ్చేందుకు వస్తున్న డ్వాక్రా సంఘాల మహిళలను కూడా మరోసారి రావాలని వెనక్కు పంపుతున్నారు.