ఇండియా-న్యూజిలాండ్ సెమీఫైనల్స్.. వెదర్ రిపోర్ట్
- మాంచెస్టర్ వాతావరణంపై సర్వత్ర ఉత్కంఠ
- ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆకాశం మేఘావృతం
- ఆ తర్వాత వర్షం పడే అవకా
ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వాతావరణంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అక్యూవెదర్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈరోజు కూడా అడపాదడపా వర్షం పడే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు వర్షం పడే అవకాశం ఉంది. 6 గంటల నుంచి 8 గంటల మధ్య వర్షం తగ్గుముఖం పడుతుంది. మళ్లీ 9 గంటల నుంచి 11 గంటల మధ్య వర్షం పలకరించే అవకాశం ఉంది. ఈ విధంగా వర్షం మధ్యమధ్యలో అడ్డుతగిలే అవకాశం ఉంది.