అడుగుతీసి అడుగేయలేకపోతున్న విజయ్ శంకర్ డ్రింక్స్ తో మైదానంలోకి ఎలా వచ్చాడు?: మురళీకార్తీక్
- విజయ్ శంకర్ గాయంపై అనుమానాలు
- మయాంక్ అగర్వాల్ తో విజయ్ శంకర్ స్థానం భర్తీ
- ట్వీట్ చేసిన మురళీ కార్తీక్
దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు మురళీ కార్తీక్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. "ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా విజయ్ శంకర్ డ్రింక్స్ తో మైదానంలో అడుగుపెట్టిన సమయంలో ఎలాంటి ఇబ్బందిలేకుండా నడిచాడు, అలాంటి ఆటగాడ్ని గాయంతో బాధపడుతున్నాడంటూ ఎలా తప్పించారు? గాయంతో అడుగుతీసి అడుగేయలేకపోతున్నాడన్న కారణంతోనే విజయ్ శంకర్ ను తప్పించినప్పుడు, అతడితో డ్రింక్స్ ఎలా తెప్పించుకున్నారు? ఈ సందేహం నా ఒక్కడికేనా, లేక ఇంకెవ్వరికైనా వచ్చిందా?" అంటూ మురళీకార్తీక్ ట్వీట్ చేశాడు.
కాగా, నెటిజన్లు సైతం విజయ్ శంకర్ ను తప్పించిన విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే విజయ్ శంకర్ ను గాయం పేరుతో స్వదేశానికి తిప్పిపంపారని సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.