రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టే చిరంజీవి మళ్లీ వచ్చారు, కల్యాణ్ బాబు అలాకాదు!: నాగేంద్రబాబు
Add ap7am to your home Screen

రాజకీయాలు వద్దనుకున్నారు కాబట్టే చిరంజీవి మళ్లీ వచ్చారు, కల్యాణ్ బాబు అలాకాదు!: నాగేంద్రబాబు

  • కల్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోడు
  • ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు సరైంది కాదు
  • భవిష్యత్తులో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వొచ్చు
ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర నిరాశాజనక ఫలితాలు లభించడంతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, మెగాబ్రదర్ నాగబాబు అవన్నీ వట్టి ఊహాగానాలే అని స్పష్టం చేశారు. వీడియో లైవ్ స్ట్రీమింగ్ లో అభిమానులతో ముచ్చటించిన నాగబాబు, తనకు తెలిసి కల్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడని చెప్పారు.

"కల్యాణ్ బాబు ఓ సారి తాను సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ అందులోకి రారు. మా అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కల్యాణ్ బాబు అలా కాదు, సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారు. ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు" అంటూ వివరించారు. అయితే, ఇందులో ఓ మినహాయింపునిచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా అతిథి పాత్ర చేయమంటే చేసే అవకాశాలున్నాయని అన్నారు. హీరోగా మాత్రం తన సోదరుడి కెరీర్ ముగిసినట్టేనని చెప్పకనే చెప్పారు.
Nagababu
Pawan Kalyan
Chiranjeevi
Jana Sena
Andhra Pradesh

More Telugu News