చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో 'బ్రహ్మానందం' అయిపోయారు!: రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

  • ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా నాదెండ్ల వెన్నుపోటు
  • బాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతల వెన్నుపోటు
  • చరిత్ర రిపీట్ అవుతూనే ఉంటుంది
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా మరోసారి విసుర్లు విసిరారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా, ఆయన్ను నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారనీ, ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారని రామ్ గోపాల్ వర్మ గుర్తుచేశారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారని చమత్కరించారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
RGV
Twitter

More Telugu News