1990 నుంచి ఇలా చేస్తూనే ఉన్నా... విరాట్ కోహ్లీ షేర్ చేసిన రెండు ఫోటోలు వైరల్!
- పాక్ తో మ్యాచ్ మధ్యలో విరాట్ పోజు వైరల్
- నడుముపై చేతులు వేసుకుని ఆకాశంవైపు చూస్తున్న కోహ్లీ
- అటువంటిదే చిన్నప్పటి ఫొటోను చూపిన భారత కెప్టెన్
తాను చిన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నానంటూ మరో ఫొటోను జోడించాడు. 1990లో తన చిన్నప్పుడు నడుముపై చేతులు ఉంచుకుని పోజిచ్చి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ రెండు ఫొటోలూ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, పాక్ పై జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 89 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తరువాతి మ్యాచ్ ని ఇండియా జట్టు శనివారం నాడు ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది.