గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు వాహనం నిలిపివేత.. ప్రయాణికుల బస్సులో వెళ్లిన టీడీపీ అధినేత

  • విపక్షనేతకు చేదు అనుభవం
  • గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు
  • ప్రత్యేక వాహనం కేటాయించని అధికారులు
అధికారంలో ఉన్నంత వరకే ఏదైనా అనేది రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే నానుడి! దీనికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విషయంలోనూ ఇది నిజమైంది! ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు ఈ సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి పయనమయ్యారు. అయితే ఎయిర్ పోర్టు ముఖద్వారం వద్దే చంద్రబాబు వాహనాన్ని భద్రతా సిబ్బంది నిలిపివేశారు. ఆయనను సాధారణ వ్యక్తిలాగా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఎయిర్ పోర్టులో ప్రవేశించడానికి చంద్రబాబు ప్రయాణికుల బస్సులో వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఓ వీఐపీ అయినా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా విమానాశ్రయ అధికారులు ప్రత్యేక వాహనాన్ని కేటాయించలేదు. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
Go Back to Shorts
Chandrababu
Gannavaram
Airport

More Telugu News