ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు శాఖల కేటాయింపు పూర్తి

12-06-2019 Wed 12:50 | Andhra
  • అజేయ్‌కల్లాంకు జీఏడీ, హోంశాఖ, ఆర్థిక, రెవెన్యూ బాధ్యతలు
  • పి.వి.రమేష్‌కు విద్య, వైద్యం, పరిశ్రమలు, వాణిజ్యం
  • ధనుంజయరెడ్డికి నీటి వనరులు, పర్యావరణం తదితరాలు
కొత్తప్రభుత్వం కొలువుదీరి అధికారుల ప్రక్షాళన జరిగాక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) బాధ్యులకు శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన జీఏడీ, హోం, శాంతిభద్రతలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ శాఖలను సీఎం ముఖ్య సలహాదారుడు అజేయ కల్లంకు అప్పగించారు. సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పీవీ రమేష్ కు పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికవసతులు, పెట్టుబడులు, విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, ఐటీ, ఇంధన శాఖలను కేటాయించారు. రవాణా, రహదారులు, భవనాల శాఖ, ఏపీఎస్‌ ఆర్టీసీ, గృహనిర్మాణం, ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల సమస్యలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, సెర్ప్, సంక్షేమ శాఖలు, క్రీడల శాఖలను సీఎం కార్యదర్శి సొల్మన్‌ ఆరోక్యరాజ్ కు కేటాయించారు.

సీఎం అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి కి వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, పర్యాటకం, నీటి వనరులు, పర్యావరణం, అటవీ, సాంకేతిక, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌డీఏ బాధ్యతలు కేటాయించారు. పశుసంవర్థక, మత్స్యశాఖ, సహకారం, సాంస్కృతిక బాధ్యతలు సీఎం మరో అదనపు కార్యదర్శి  జే.మురళి చూడనున్నారు.  సీఎం ప్రత్యేక అధికారి ముక్తాపురం హరికృష్ణకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌, విజ్ఞాపనలను కేటాయించారు. ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి సీఎం అపాయింట్‌మెంట్స్‌‌ బాధ్యతలను చూస్తారు.
CMOdepartmentssecretaries

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more