నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 10:30 గంటలకు శాసనసభలోని సీఎం చాంబర్లోకి జగన్

12-06-2019 Wed 06:24 | Andhra
  • ఐదు రోజులపాటు జరగనున్న సమావేశాలు
  • తొలుత జగన్, ఆ తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • శుక్రవారం గవర్నర్ ప్రసంగం
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరగనుండగా, నేటి ఉదయం 11 గంటలకు తొలి సమావేశం ప్రారంభం అవుతుంది. ఆ వెంటనే ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది. అనంతరం మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 15, 16 తేదీల్లో సభకు విరామం కాగా, 17,18 తేదీల్లో తిరిగి సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి జూలైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు శాసనసభలోని తన చాంబర్‌లో అడుగుపెడతారు. వేదపండితుల పూజా కార్యక్రమాల అనంతరం తన సీట్లో కూర్చుంటారు. 11:05 గంటలకు శాసనసభలో అడుగుపెడతారు. ప్రస్తుత అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 151 కాగా, తెలుగుదేశం పార్టీకి 23 మంది, జనసేనకు ఒక ఎమ్మెల్యే వున్నారు. 
Andhra PradeshJaganChandrababuAssembly

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more