పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా నాకు దొరికేది కాదు: రావెల కిశోర్ బాబు

10-06-2019 Mon 19:09 | Andhra
  • కనీసం ఫోన్లో కూడా పవన్ మాట్లాడే వారు కాదు
  • పవన్ నా సలహాలు, సూచనలు ఎప్పుడూ తీసుకోలేదు
  • రాజకీయవ్యూహాలపై చర్చకు నాకు అవకాశమివ్వలేదు
జనసేన కీలక నేతల్లో తాను కూడా ఒకడిని అన్న వార్త అవాస్తవమని, పవన్ కల్యాణ్ ఎప్పుడూ తన సలహాలు, సూచనలు తీసుకోలేదని రావెల కిశోర్ బాబు అన్నారు. తిరుపతిలో నిన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీలో ఆయన చేరారు. ఈరోజు గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, అసలు, పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ కూడా తనకు దొరికేది కాదని, ఫోన్లో కూడా మాట్లాడే వారు కాదని చెప్పారు.

 పైకి సన్నిహితంగా కనిపించినప్పటికీ, రాజకీయపరమైన వ్యూహాలపై చర్చించేందుకు పవన్ కల్యాణ్ తనకు ఎప్పుడూ అవకాశమివ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయన్న వాదనపై ఆయన మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి వరకూ ప్రచారం జరిగిందని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారని అన్నారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టవుతుందని, మళ్లీ అవినీతి టీడీపీకే పట్టం కట్టాల్సి వస్తుందని భావించిన ప్రజలు చంద్రబాబును, టీడీపీని పక్కనబెట్టి, వైసీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని విశ్లేషించారు.
Jana SenaPawan Kalyanbjpravela kishore

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more