టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ రేపటికి వాయిదా

10-06-2019 Mon 17:41 | Both States
  • హైకోర్టులో ఇవాళ రవిప్రకాశ్ బెయిల్ పై విచారణ
  • వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది
  • రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యే అవకాశం!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఇవాళ హైకోర్టులో ఈ కేసు విచారణలో భాగంగా రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పై వాదనలు కొనసాగాయి. దీనిపై హైకోర్టు విచారణను రేపటికి వాయిదావేసింది.

ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, రవిప్రకాశే నటుడు శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు దాఖలు చేయించాడని ఆరోపించారు. రవిప్రకాశ్ నుంచి శివాజీ ఎలాంటి షేర్లను కొనుగోలు చేయలేదని కూడా స్పష్టం చేశారు. 40,000 షేర్లను రూ.20 లక్షలకు విక్రయించి ఉంటే ఆ లావాదేవీల వివరాలను ఐటీ విభాగానికి ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు.

ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
TV9Raviprakash

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more