నారాయణాద్రి, వెంకటాద్రి సహా పలు రైళ్లలో స్లీపర్ బోగీల తగ్గింపు!

09-06-2019 Sun 09:15 | Both States
  • ప్రతి రైలులో ఒక్కో బోగీ తగ్గింపు
  • స్లీపర్ బోగీల స్థానంలో ఏసీ బోగీలు
  • ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో రైల్వే శాఖ
  • అభ్యంతరం చెబుతున్న ప్రయాణికులు
ఓ వైపు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయి, అదనపు స్లీపర్ బోగీలను ఏర్పాటు చేయాలని సామాన్య ప్రయాణికులు డిమాండ్ చేస్తుంటే, ఉన్న బోగీలనే తొలగించే పనిలో రైల్వే శాఖ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రాది ఎక్స్ ప్రెస్, నారాయణాద్రి, గౌతమి, సింహపురి, దేవగిరి ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఒక్కో స్లీపర్‌ బోగీని తగ్గించాలని, త్వరలో మరికొన్ని రైళ్లలో నుంచి కూడా స్లీపర్ బోగీలను తగ్గించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి స్థానంలో రైల్వేలకు అధిక ఆదాయాన్ని ఇచ్చేలా ఏసీ బోగీలను జోడించాలన్నది రైల్వే శాఖ యత్నం.

కాగా, నిత్యమూ హైదరాబాద్ నుంచి తిరుపతికి సగటున 9 రైళ్లు నడుస్తుండగా, వాటిల్లో సరాసరి 150 వరకూ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ నిర్ణయంతో మరో 80 మందికి (72 బెర్తులు, 8 ఆర్ఏసీ) బెర్త్ లు కన్ఫార్మ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో సాధారణ ప్రయాణికులు మరింత కష్టపడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్లీపర్ బోగీలో బెర్త్ కు  రూ. 370 ఉండగా, ఏసీ బోగీలో అయితే కనీసం రూ. 1000 వరకూ చెల్లించాల్సి వుంటుంది. స్లీపర్ బోగీలు తొలగించి ఏసీ బోగీలు తగిలించడం వల్ల సాధారణ ప్రజలకు లాభం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం అర్ధం లేనిదని, సామాన్యులు వెళ్లే స్లీపర్‌ బోగీలనే పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
RailwaysSleeper ClassAC Compartment

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more