సునీల్ వైపే మొగ్గుచూపిన రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సునీల్ వైపే మొగ్గుచూపిన రవితేజ

  • రవితేజ హీరోగా 'డిస్కోరాజా'
  • నాయికలుగా పాయల్ - నభా
  •  'అల్లరి' నరేశ్ లేనట్టే   
వీఐ ఆనంద్ - రవితేజ కాంబినేషన్లో 'డిస్కోరాజా' రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికలుగా పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ నటిస్తున్నారు. ఓ ముఖ్యమైన పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. అయితే సునీల్ స్థానంలో 'అల్లరి' నరేశ్ ను తీసుకోనున్నట్టుగా రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ జరగడం లేదనేది తాజా సమాచారం.

'మహర్షి' లో 'అల్లరి' నరేశ్ పాత్రకి వచ్చిన రెస్పాన్స్ చూసిన ఆనంద్, సునీల్ స్థానంలో 'అల్లరి' నరేశ్ ను తీసుకోవాలనే ఆలోచన చేశాడట. అయితే సునీల్ కి .. రవితేజకి మంచి స్నేహం వుంది. అందువలన సునీల్ ను తప్పించడానికి రవితేజ అంగీకరించలేదట. ఇక సునీల్ .. 'అల్లరి' నరేశ్ కూడా మంచి స్నేహితులు, అందువలన సునీల్ స్థానంలో చేయమంటే 'అల్లరి' నరేశ్ ఒప్పుకోవడం కష్టం. అందువల్లనే సునీల్ తో కంటిన్యూ చేయడానికే ఆనంద్ సిద్ధమయ్యాడని చెప్పుకుంటున్నారు. 
raviteja
payal
nabha

More Telugu News