సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ ప్రకటన జారీ చేసిన శాసనసభ కార్యదర్శి
- స్పీకర్ని కలిసిన 12 మంది ఎమ్మెల్యేలు
- టీఆర్ఎస్లో తమను విలీనం చేయాలని వినతి
- అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా మారిన ఎంఐఎం
ఈ నేపథ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు శాసనసభ కార్యదర్శి ఓ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 6కి పడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. దీంతో శాసనసభలో 7 స్థానాలున్న ఎంఐఎం అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.