వైసీపీ తరఫున పోటీ చేయమని కోరారు... నేనే వద్దన్నా: వీవీ వినాయక్
Add ap7am to your home Screen

వైసీపీ తరఫున పోటీ చేయమని కోరారు... నేనే వద్దన్నా: వీవీ వినాయక్

  • త్వరలో హీరోగా నటించనున్న మాస్ డైరెక్టర్
  • పిల్లలు ఎదిగాక రాజకీయాల గురించి ఆలోచిస్తా
  • వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్న వీవీ
ఎంతోమంది హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు చేసిన మాస్ డైరెక్టర్‌ వీవీ వినాయక్, ఇప్పుడు హీరోగా మారబోతున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి, రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారని, పోటీ చేసేందుకు కావాల్సిన శక్తి తన వద్ద లేదని భావించి తిరస్కరించానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.

తన తండ్రి వైఎస్ ను ఎంతో అభిమానించేవారని, అప్పట్లో ఆయన రాజకీయాల్లో కొనసాగారని, ప్రస్తుతం సోదరుడు సురేంద్ర వైసీపీలో ఉన్నారని చెప్పారు. తన తల్లి చనిపోయిన సమయంలో జగన్ స్వయంగా ఇంటికి వచ్చి ఓదార్చారని, ఒక దశలో వైఎస్ బావమరిది, 'యోగి' చిత్ర నిర్మాత రవీందర్‌ రెడ్డి తనను ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగారని చెప్పారు. అప్పట్లో తన తల్లి కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు అంగీకరించలేదని, రాజకీయాల్లోకి వెళ్లాలన్న కోరిక ఉంటే, పిల్లలు ఎదిగాక ప్రయత్నించాలని సూచించారని చెప్పారు. భవిష్యత్తులో రాజకీయాల గురించి ఆలోచిస్తానని అన్నారు.
VV Vinayak
YSRCP
Jagan

More Telugu News