50 శాతం ఓట్లు కొల్లగొడతామని చెప్పాం.. కొట్టి చూపించాం!: బీజేపీ చీఫ్ అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 శాతం ఓట్లు కొల్లగొడతామని చెప్పాం.. కొట్టి చూపించాం!: బీజేపీ చీఫ్ అమిత్ షా

  • మోదీ నాయకత్వంలో విజయంపై ధీమాగా ఉన్నాం
  • కానీ కొందరు మా విజయంపై అనుమానాలు వ్యక్తంచేశారు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే 352 లోక్ సభ స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ విజయంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని షా తెలిపారు.

అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో కనీసం 50 శాతం ఓట్లను దక్కించుకుంటామనీ, భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని తనకు నమ్మకం ఉండేదని పేర్కొన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో  17 రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఓట్లు సాధించామనీ, మరో 9 రాష్ట్రాల్లో 45 నుంచి 50 శాతం ఓట్లు సాధించామని చెప్పారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో వెల్లూరు స్థానానికి ఎన్నికలు రద్దుకావడంతో 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
BJP
Narendra Modi
Amit Shah
50 percent votes

More Telugu News