బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వాని ఇంటికి మోదీ.. ప్రశంసలు కురిపించిన ప్రధాని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వాని ఇంటికి మోదీ.. ప్రశంసలు కురిపించిన ప్రధాని!

  • అద్వాని ఆశీస్సులు తీసుకున్న మోదీ, షా
  • ఇలాంటి దిగ్గజాల వల్లే బీజేపీ బలపడిందని వ్యాఖ్య
  • అద్వానిజీని మర్యాదపూర్వకంగా కలిశామని వివరణ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానిని కలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా తో కలిసి అద్వాని ఇంటికి వెళ్లిన మోదీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ.. అద్వానిజీ లాంటి గొప్ప దిగ్గజాలు పార్టీ నిర్మాణం కోసం దశాబ్దాలపాటు చేసిన కృషి కారణంగానే నేడు బీజేపీ భారీ విజయం అందుకుందని ఫ్రశంసించారు. ఈ నేపథ్యంలో అద్వానిజీని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు.
BJP
Narendra Modi
Amit Shah
lk adwani

More Telugu News