ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం.. ఆ తర్వాత విందు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశం.. ఆ తర్వాత విందు!

  • హాజరైన మోదీ, కేంద్ర మంత్రులు, కీలక నేతలు
  • ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • అశోకా హోటల్ లో నేతలకు విందు ఏర్పాటు
గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ నేతలు కొద్దిసేపటి క్రితం సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు హాజరైనట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీ అనంతరం, ఎన్డీఏ నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అశోకా హోటల్ లో ఈ విందు ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఇటీవల వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి విదితమే. 282 నుంచి 365 స్థానాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించబోతోందని పన్నెండు సంస్థలు తమ సర్వేలో పేర్కొన్నాయి.
New Delhi
Bjp
Amit Shah
narendra modi

More Telugu News