జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఎంపీ కవిత కుమారుడు.. పరామర్శించిన కేసీఆర్
Add ap7am to your home Screen

జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ఎంపీ కవిత కుమారుడు.. పరామర్శించిన కేసీఆర్

  • రెయిన్‌బో ఆసుపత్రిలో చేరిక 
  • వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్న కేసీఆర్
  • నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య (11) స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆర్యను బుధవారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చి మనవడిని పలకరించారు. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పది నిమిషాలపాటు మనవడితో గడిపిన కేసీఆర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. ప్రస్తుతం ఆర్య ఆరోగ్యం కుదుటపడిందని పేర్కొన్న వైద్యులు నేడు డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలిపారు.
KCR
K Kavitha
Arya
hospital

More Telugu News