హీరోగా మోహన్ లాల్ .. విలన్ గా అర్బాజ్ ఖాన్

  • మోహన్ లాల్ కథానాయకుడిగా 'బిగ్ బ్రదర్'
  • జూలై నెలలో షూటింగు మొదలు 
  • అక్టోబర్లో విడుదల చేసే ఆలోచన
మలయాళంలో మోహన్ లాల్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తున్నాడంటే అభిమానులందరి దృష్టి దానిపైనే ఉంటుంది. వైవిధ్యభరితమైన చిత్రాలనే ఆయన ఎక్కువగా అంగీకరిస్తుంటారు. ఆయన తాజా చిత్రంగా 'బిగ్ బ్రదర్' రూపొందనుంది. ఈ సినిమాకి సిద్ధిఖీ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట. చాలామంది పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు చివరికి సల్మాన్ సోదరుడైన 'అర్బాజ్ ఖాన్' ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అర్బాజ్ ఖాన్ ధ్రువీకరించాడు. "మలయాళంలో నేను చేస్తున్న మొదటి సినిమా ఇది. సిద్ధిఖీ దర్శకత్వంలో మోహన్ లాల్ గారితో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా వుంది. షూటింగు ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తితో వున్నాను" అని అన్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగును జూలై నెలలో ఆరంభించి, అక్టోబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Go Back to Shorts
mohanlal
arbaaz khan

More Telugu News