రాజీవ్‌గాంధీపై మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ సీనియర్ నేత
- రాజీవ్‌ను కరెప్షన్ నంబరు వన్ అన్న మోదీ
- ఖండించిన బీజేపీ సీనియర్ నేత
- ఇలాంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించబోరన్న శ్రీనివాస ప్రసాద్
‘‘రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ రాజకీయ ఉద్దండుడైన వాజ్‌పేయి లాంటి వారే రాజీవ్ గురించి గొప్పగా చెప్పారని ప్రసాద్ గుర్తు చేశారు.