జార్ఖండ్ లో భార్యతో కలిసి ఓటేసిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని!
- నేడు ఐదో విడత పోలింగ్
- మొత్తం 51 స్థానాలకు ఎన్నికలు
- సాక్షితో కలిసి ఓటేసిన మిస్టర్ కూల్
జార్ఖండ్ లోని రాంచీలో ఉన్న జవహర్ విద్యా మందిర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. అనంతరం ఓటేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్లో 14, రాజస్థాన్ లో 12, మధ్యప్రదేశ్ లో 7, పశ్చిమ బెంగాల్ లో 7, బిహార్లో 5, జార్ఖండ్ 4, జమ్ముకశ్మీర్లో 2 లోక్ సభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.