విమానంలో కారును పంపుతున్నామంటే... నమ్మేసి రూ. 2.30 లక్షలు సమర్పించుకున్న హైదరాబాదీ!
- ఆన్ లైన్ లో కారు కోసం వెతుకులాట
- తక్కువ ధరకు వస్తుందని అపరిచితుల ఖాతాల్లోకి డబ్బు
- రాజస్థాన్ సైబర్ నేరగాళ్ల పనేనని తేల్చిన పోలీసులు
ఆపై ఫోన్ చేసిన అతను, హైదరాబాద్ లో తన ఫ్రెండ్ సాహిల్ కుమార్ ఉన్నాడని, అతడే మిగతా వివరాలన్నీ చూస్తాడని చెబుతూ అతని సెల్ నంబర్ ఇచ్చాడు. సాహిల్ కు బాధితుడు ఫోన్ చేయగా, డబ్బిచ్చిన తరువాత కారును అప్పగిస్తానని నమ్మబలకడంతో రూ. 1.50 లక్షలు చెల్లించాడు. ఆపై ఇన్సూరెన్స్ డిపాజిట్ అని ఇతర చార్జీలని చెబుతూ మరో రూ. 80 వేలు లాగిన తరువాత, జీఎస్టీ కట్టాలని రూ. 30 వేలు పంపాలని చెప్పడంతో అప్పటికిగాని అసలు విషయం తెలిసిరాలేదు. దీంతో లబోదిబో మంటూ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, ఇది రాజస్థాన్ లోని భరత్ పూర్ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ క్రైమ్ ముఠా పనేనని తేల్చి కేసు విచారణ చేపట్టారు.