ఈవీఎంలలో ఉండే సాంకేతిక సమస్యలు ఏజెంట్లకు తెలుస్తాయా?: సీఎం చంద్రబాబు

  • ఈవీఎంలు వచ్చినప్పటి నుంచీ పోరాడుతూనే ఉన్నా
  • వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేందుకు ఇబ్బందేమిటి?
  • ప్రతీ వ్యవస్థ జవాబుదారీతనంతో ఉండాలి
ఈవీఎంలలో ఉండే సాంకేతిక సమస్యలు ఏజెంట్లకు తెలుస్తాయా? అని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఉండవల్లిలోని ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలు వచ్చిన రోజు నుంచీ తాను పోరాడుతూనే ఉన్నానని, తన పోరాటం వల్లే వీవీప్యాట్స్ వచ్చాయని అన్నారు. వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేందుకు ఈసీకి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తే కనుక వీవీ ప్యాట్స్ తప్పకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ వ్యవస్థ జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
cm
Chandrababu
EVM`s

More Telugu News