ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తివేసిన ఈసీ!
- ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఫణి
- విశాఖ, విజయనగరం, తూ.గోదావరి, శ్రీకాకుళంలో కోడ్ ఎత్తివేత
- సహాయక చర్యలను ముమ్మరం చేయనున్న ప్రభుత్వం
తాజా నిర్ణయం నేపథ్యంలో అధికారులు ఇక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయనున్నారు. అలాగే ప్రభుత్వం ఇక్కడి పరిస్థితిని సమీక్షించడం వీలవుతుంది. ఒడిశాలోని పూరీ వద్ద ఫణి తుపాను తీరాన్ని తాకిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో మరో 3-4 గంటలు భారీ వర్షాలు, భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.