సోమిరెడ్డి సమీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చిన ఈసీ
- సమీక్షలకు హాజరుకాని అధికారులు
- కోడ్ కారణంగా గైర్హాజరు
- తుపాను నేపథ్యంలో ఈసీ గ్రీన్ సిగ్నల్
తుపాను ప్రభావంతో పంట నష్టం, కరవు తదితర ప్రకృతి వైపరీత్యాలపై సమీక్ష నిర్వహించుకునేందుకు తాజాగా ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో రేపు సచివాలయంలోని తన ఛాంబర్‌లోనే సోమిరెడ్డి సంబంధిత శాఖాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈసీ అనుమితినిచ్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు ప్రత్యేక కమిషనర్లు కూడా హాజరు కానున్నారు.