విజయసాయిరెడ్డికి అంత నైతికత ఉందా?: నాగబాబు సెటైర్
- లక్ష్మీ నారాయణ ఎక్కడ? విజయసాయి ఎక్కడ?
- 25 రోజులు ఆగకుండా సర్వేలంటున్నారా
- ఈ దరిద్రం మాకొద్దన్న నాగబాబు
మనం ఒక్కళ్లమే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒక్కడే. రూములో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ మనశ్శాంతిగా ఉన్నారు. నాయుడుగారేమో సమావేశాల మీద సమావేశాలు, జగన్ గారేమో... ఆ విజయసాయిరెడ్డితోటి రకరకాల వింత ట్వీట్లు. విజయసాయిరెడ్డి నాకు ఒకప్పుడు ఫ్రెండ్. ఆయనకు జేడీ లక్ష్మీ నారాయణ మీద ట్వీట్ వేసేంత నైతికత ఉందా అసలు? ఊహించగలమా? ఆయనెక్కడ? విజయసాయిరెడ్డి ఎక్కడ? ఓ రెండు మూడు సార్లు చదివిన తరువాత... బాబూ నీతో దరిద్రం మాకొద్దు, పనులున్నాయని చెప్పి, వదిలించుకున్నా" అని అన్నారు.