దిశ మార్చుకుంటున్న ‘ఫణి’ తుపాన్.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంవైపు ప్రయాణం
- మే 2, 3 తేదీల నాటికి తీరం సమీపానికి
- ఆ సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు
- తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
తుపాన్ తీరం సమీపానికి వచ్చేసరికి గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్ ఒడిశా దిశగా కదులుతున్న సమయంలో మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.