13 రాష్ట్రాల్లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. బరిలో హేమాహేమీలు
- 13 రాష్ట్రాలు, 116 నియోజకవర్గాల్లో పోలింగ్
- పోటీలో 1,640 మంది అభ్యర్థులు
- పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
హేమాహేమీలంతా ఈ విడతలోనే బరిలో ఉండడంతో మూడోదశకు ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున ఖర్గే తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లోక్సభ స్థానాలతోపాటు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. కాగా, శ్రీలంక ఉగ్రదాడుల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.