మిస్టర్ కూల్ కు ఆగ్రహం వచ్చింది... జరిమానా పడింది!
- పెవిలియన్ నుంచి మైదానంలోకి వచ్చి గొడవచేసిన ధోనీ
- నో బాల్ ప్రకటించి, వెనక్కు తీసుకున్న అంపైర్లు
- మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించిన ఐపీఎల్
అంతకుముందు చివరి ఓవర్ ను స్టోక్స్ వేస్తూ, శాంటనర్ కు ఫుల్ టాస్ బాల్ వేశాడు. ఈ బాల్ గాల్లోకి లేచి, ఆరు పరుగులు తెచ్చింది. ఇదే బాల్ ను తొలుత నోబాల్ గా ప్రకటించిన అంపైర్లు, దాన్ని వెనక్కు తీసుకోవడమే ధోనీ ఆగ్రహానికి కారణమైంది. ఫీల్డ్ అంపైర్ ఉల్లాస్ ఘాండే దీన్ని నోబల్ అని పేర్కొనగా, స్క్వేర్ లెగ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ దాన్ని నోబాల్ కాదని తేల్చారు. దీంతో అప్పటికే పెవిలియన్ చేరిన ధోనీ, తిరిగి మైదానంలోకి వచ్చి గొడవకు దిగాడు.