ఈసీ తనిఖీలు.. పట్టుబడ్డ నగదులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్!
- దేశవ్యాప్తంగా రూ.509 కోట్లు పట్టుకున్నామన్న ఈసీ
- తొలి స్థానంలో హరియాణా, రెండో స్థానంలో తమిళనాడు
- దేశవ్యాప్తంగా 719 కోట్ల రూపాయల డ్రగ్స్ స్వాధీనం
ఈ తనిఖీల్లో భాగంగా రూ.414 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ జాబితాలో రూ.513.44 కోట్ల నగదుతో హరియాణాలో తొలిస్థానంలో నిలిచినట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రూ.401.46 కోట్లతో రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇక పట్టుబడ్డ నగదు విషయంలో రూ.190.3 కోట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు.