సత్తెనపల్లిలో పవన్ పర్యటన రద్దు?

  • తెనాలిలో రోడ్ షో, సభ నిర్వహణపై తేలని నిర్ణయం
  • పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది 
  • పవన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, సభ నిర్వహిస్తారా లేదన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. పవన్ కల్యాణ్ పర్యటన రద్దుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆయన ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన పర్యటన వాయిదా పడిందన్న వార్తలు వినవస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Go Back to Shorts
janasena
Pawan Kalyan
sattenapalli
tenali

More Telugu News