కోల్‌కతాలో పెద్ద సంఖ్యలో చైనా మూలాలున్న ఓటర్లు.. వారి భాషలోనే టీఎంసీ ప్రచారం
- టీఎంసీ వినూత్న ప్రచారం
- చైనా మూలాలున్న వారిని ఆకట్టుకునే ప్రయత్నం
- తాంగ్రాలో నివసిస్తున్న 2 వేల మంది చైనా సంతతి ప్రజలు
నగరంలోని తాంగ్రాలో చైనా సంతతి ప్రజలు 2 వేల మంది వరకు నివసిస్తుండడంతో టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. అంతేకాదు, చైనా భాషలో కరపత్రాలు కూడా ముద్రించి పంచనున్నట్టు టీఎంసీ నేత ఒకరు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న చైనా సంతతి వారికి హిందీతోపాటు స్థానిక భాషలు వచ్చినప్పటికీ వారి మాతృభాషలో ప్రచారం చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించబట్టే ఈ ప్రచారానికి దిగినట్టు ఆయన పేర్కొన్నారు.